విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

Jan 13,2024 15:49 #Chandrababu Naidu, #CID

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సీఐడీ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో ఆయన పూచీకత్తు సమర్పించారు. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని బెయిల్‌ షరతులు విధించింది దీంతో చంద్రబాబు సీఐడీకి కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారిని కలిశారు. సీఐడీ కార్యాలాయానికి చేరుకున్న చంద్రబాబును చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎగబడ్డారు. అందరికీ అభివాదం చెబుతూ చంద్రబాబు సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు.

➡️