చంద్రబాబు సిఎం కావాలని కోరుకున్నా

May 17,2024 21:49 #Raghuramakrishna Raja, #speech

కూటమికి 125-150 సీట్లు : రఘురామకృష్ణంరాజు
ప్రజాశక్తి- తిరుమల :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రావాలని కోరుకున్నానని, కూటమికి 125ా150 సీట్లు తప్పకుండా వస్తాయని ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. గురువారం చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించిన ఆయన, శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ వైసిపి 25ా40 సీట్లకే పరిమితమవుతుందన్నారు. తన మాట నిజం అవుతుందో, జగన్‌ మాట నిజమవుతుందో జూన్‌ 4న తెలుస్తుందన్నారు.

➡️