చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తా : గుమ్మనూరు జయరాం

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తానని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సదస్సు వేదికగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ రోజు మరోసారి చంద్రబాబును కలిసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేశాక.. బర్తరఫ్ చేసినా.. ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు.. చంద్రబాబు నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా.. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను. ఆలూరుకు సేవలందించాను.. ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. గుంతకల్లు సీటు మీద కొందరు ఆశలు పెట్టుకోవచ్చు.. కానీ, నేను అందర్నీ కలుపుకుని వెళ్తాను. నాకెవ్వరితోనూ గొడవల్లేవు.. ఆలూరులోని వైసీపీ కేడర్ బయటకొచ్చేసింది.. వాళ్లు అంతా నాతో ఉంటారు’’అని పేర్కొన్నారు.

➡️