నిర్బంధాలు-అరెస్టుల మధ్య ‘ఛలో అనంత’ జర్నలిస్టుల ర్యాలీ

Feb 22,2024 13:34 #'Chalo Ananta', #journalists, #Rally

అనంతపురం : ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడికి నిరసనగా …గురువారం ”ఛలో అనంత”కు ఎపియుడబ్ల్యుజె పిలుపునిచ్చిన నేపథ్యంలో … పోలీసులు అణచివేత చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ జర్నలిస్టులను అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ నిర్బంధాల మధ్యనే జర్నలిస్టులు ర్యాలీని విజయవంతం చేశారు. సంగమేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు జర్నలిస్టులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులు రక్షణ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడు ఐవి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌ మాట్లాడుతూ… జగన్‌ ముఖ్యమంత్రి అయితే జర్నలిస్టులకు మేలు జరుగుతుందని తాము భావించామని… కానీ మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేవాలయాలపై వార్తలు రాస్తున్నారంటూ జర్నలిస్టులపై కేసులు బనాయించారన్నారు. నాడు – నేడు పనులు పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులపై వార్తలు రాస్తే కేసులు పెట్టారన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల మధ్య విభేదాలు సఅష్టిస్తున్నారన్నారు. మీడియాను కంట్రోల్‌ చేసే వ్యూహంలో ఆమరావతి నుంచి బ్యాగులు పంపిస్తున్నారని ఆరోపించారు. భయభ్రాంతులకు గురి చేయడం కోసం దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియాపై జరుగుతున్న దాడులపై దేశ వ్యాప్తంగా ఐక్య పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సాక్షి పత్రిక ఛానల్లోని జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛ లేదని… జగన్‌ ఫోటో, వీడియో బాగా రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. రిపోర్టర్‌ శ్రీకఅష్ణపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రజా మద్దతును చూశామన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ”సిద్ధం” పేరుతో పత్రికలను తిట్టడంతోనే జర్నలిస్టులపై దాడులు చేశారన్నారు. మానవత్వం లేకుండా భయపెట్టి పాలన సాగిస్తున్నారన్నారు. పోలీసుల పరువును కాపాడాల్సిన బాధ్యత డిజిపిదే అని.. ఇంత ఘటన జరిగితే డిజిపి ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. మీడియాపై దాడి జరిగితే హత్యాయత్నం కేసులు బనాయించాలి అని అన్నారు. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పకపోతే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని ఐవి.సుబ్బారావు హెచ్చరించారు.

➡️