‘కుశలవ’ గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు విజయం

Dec 29,2023 09:57 #CITU, #Trade Unions
citu win in kusavala union elections

ప్రజాశక్తి – ఆగిరిపల్లి : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలోని కుశలవ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో గురువారం జరిగిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ది కుశలవ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కుశలవ ఎంప్లాయీస్‌ యూనియన్‌పై 45 ఓట్లతో గెలుపొందింది. మొత్తం 307 ఓట్లు పోలవగా, కుశలవ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (సిఐటియు)కు 139 ఓట్లు, కుశలవ ఆల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు 94 ఓట్లు, టిఎన్‌టియుసికి 74 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షులు డి.వి.కష్ణ, సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ నిరంతరం కార్మికుల శ్రేయస్సు, హక్కుల రక్షణ కోసం పని చేస్తున్న సిఐటియు పట్ల నమ్మకంతో గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం, సమస్యల పరిష్కారం కోసం యూనియన్‌ కృషి చేస్తుందన్నారు. యాజమాన్యం ఎన్ని కుట్రలు పన్నినా నిజాయితీగా పనిచేస్తున్న సిఐటియును కార్మికులు గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌, ఏలూరు జిల్లా సిఐటియు నాయకులు జి.రాజు, యూనియన్‌ కార్యదర్శి కెవికెఎస్‌.ప్రసాద్‌, ఆర్‌.చంటి, శ్రీరామ్మూర్తి, రామకష్ణ, నరేష్‌, శ్రీనివాస్‌, కోటేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️