6నెలల వేతనాలు చెల్లించాలని క్లాప్ డ్రైవర్ల ధర్నా

clap drivers protest for pending wages

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటింటి చెత్త సేకరణ చేసే క్లాప్ ఆటో డ్రైవర్లకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు నేతలు వెంకటనారాయణ ఆర్వి నాయుడు రామిరెడ్డి లు మాట్లాడుతూ ఆరు నెలలుగా కార్మికులు విధులు నిర్వహిస్తున్న వారికి వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు పలుమార్లు కమిషనర్ మేయర్ దృష్టికి తీసుకువెళ్లిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. రెడ్డి ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లాప్ ఆటోలకు ఆటోలకు మున్సిపాలిటీ 80 లక్షలు చెల్లించిన వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పనులు చేయించుకునే అధికారులు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడి చర్యలు చేపట్టకపోవటం బాధ్యతారాహిత్యం అన్నారు. ఒక నెల వేతనము రాకుంటేనే గగ్గోలు పెట్టే అధికారులకు కార్మికుల ఆకలి కేకలు వినిపించకపోవడం దారుణమన్నారు ఇప్పటికైనా ఏజెన్సీ నిర్వహణ పిలిపించి క్లాప్ ఆటో డ్రైవర్లకు ఆరు నెలల వేతనాలు ఇప్పించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం ఒకటో పట్టణ కార్యదర్శి, రామిరెడ్డి, సిపిఎం రెండో పట్టణ కమిటీ కార్యదర్శి, ఆర్ వి నాయుడు, ఒకటో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎన్టీఆర్ సీనా, వెంకట్ నారాయణ, సిపిఎం నాయకులు ప్రకాష్, మునిసిపల్ సిఐటియు ఉపాధ్యక్షులు, లక్ష్మీనారాయణ, నగర అధ్యక్షులు బండారి ఎర్రి స్వామి, నగర కార్యదర్శి, సాకే తిరుమలేశు, శశింద్ర కుమార్, శ్రీనివాసమూర్తి, రాఘవ, నాగేంద్ర, జయరాం, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️