నేడు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిపై ఫోకస్‌ పెట్టనున్నారు. అందులో భాగంగా గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ఈ రోజు ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు.. సిడ్‌ యాక్సిస్‌ రోడ్‌, ఆలిండియా సర్వీసెస్‌ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గఅహ సముదాయాలను పరిశీలించబోతున్నారు.
ఇక, ఐకానిక్‌ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్లను పరిశీలించబోతున్నారు.ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన గత ప్రభుత్వం.. భవనాలను పట్టించుకోలేదు.. 70, 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం నాటి వైసీపీ ప్రభుత్వం వదిలేసిందనే విమర్శలు ఉన్నాయి.. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటి వైసీపీ సర్కార్‌ ఆయన్ని అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించబోతున్నారు.

➡️