Pulivendulaలో డాక్టర్‌ వైఎస్సార్‌ సర్వజన ఆసుపత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

పులివెందుల (వైఎస్‌ఆర్‌ కడప) : పులివెందులలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సర్వజన ఆసుపత్రిని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సోమవారం ప్రారంభించారు. పులివెందులలో వైఎస్‌అర్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిని సిఎం ప్రారంభించారు. ఆసుపత్రిలో డాక్టర్‌ వైఎస్‌అర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మెడికల్‌ కళాశాల, అసుపత్రికి సంబంధించిన వివరాలను వైద్య అరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి కృష్ణబాబు సిఎం కు వివరించారు. ఆస్పత్రి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. పులివెందులలో మెడికల్‌ కాలేజీ 51 ఎకరాల్లో, రూ.500 కోట్ల వ్యయంతో నిర్మాణమైంది. ఈ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ తరగతులు 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం పులివెందులలో బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ను సిఎం జగన్‌ ప్రారంభించారు. రూ.20 కోట్ల వ్యయంతో ఈ ప్యాక్‌ హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది.

➡️