పులివెందులలో సిఎం జగన్‌ ముందంజ

Jun 4,2024 09:38 #ap cm jagan, #lead, #pulivendula

పులివెందుల (వైఎస్‌ఆర్‌) : ఎపి సిఎం జగన్‌ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా … తన సమీప ప్రత్యర్థి బీటెక్‌ రవి కంటే జగన్‌ ఆధిక్యంలో నిలిచారు. మరో 12 నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బత్స, గజపతినగరంలో బత్స అప్పలనర్సయ్య, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి ఆధిక్యంలో నిలవగా… అనపర్తిలోనూ వైసిపి ముందంజలో ఉంది. తిరుపతి అసెంబ్లీ, లోక్‌ సభ స్థానాల్లో వైసిపి లీడింగ్‌ లో కొనసాగుతోంది. హిందూపురం ఎంపి స్థానంలోనూ వైసిపి ముందంజలో ఉంది.

➡️