మట్టిలో మాణిక్యాలనువెలుగులోకి తీసుకొచ్చేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ : సిఎం వైఎస్‌ జగన్‌

Dec 21,2023 07:33 #CM YS Jagan, #Sports
cm jagan on adukundam andhra

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోగ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతిభావంతులను వెతికి పట్టుకోగలిగితే పివి సింధు, జ్యోతి సురేఖ, రాయుడు, శ్రీకాంత్‌, సాకేత్‌ వంటి అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతామన్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఈ నెల 26న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, ఇందుకోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. సిఎస్‌, సిఎంఒ కార్యాలయ అధికారులు, అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. 15 వేల సచివాలయాలను ఒక కార్యక్రమంలో భాగం చేయడంతోపాటు సచివాలయ స్థాయి క్రీడలను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తున్నామని సిఎం వెల్లడించారు. ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ మీద శ్రద్ధ పెడుతు న్నామన్నారు. ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖోలను ప్రమోట్‌ చేయాలన్నారు. క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్‌, మున్సిపల్‌ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు అన్నింటినీ క్రోఢకీరించి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఈ నెల 26 కన్నా ముందే సచివాలయం పరిధిలో డిస్‌ప్లే చేయాలని, వలంటీర్లు కూడా అవేర్‌నెస్‌ చేసేలా చూడాలన్నారు. 15 సంవత్స రాలు పైబడిన వారిని, ప్రధానంగా బాలికలను ఎక్కువగా ప్రోత్సహించా లన్నారు. ఆడుదాం ఆంధ్రా కోసం 1.23 కోట్లు రిజిస్ట్రేషన్స్‌ జరిగాయని, 34.19 లక్షల మంది క్రీడాకారులు పాల్గొం టున్నారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

 

  • నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్స్‌

నియోజకవర్గస్థాయి నుంచి ప్రొఫెషనల్స్‌కు చేయూత నిచ్చే కార్యక్రమం మొదలవుతుందని, క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌కింగ్స్‌, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ టాలెంట్‌ హంట్‌లో భాగస్వాములవుతా మన్నారు. బ్యాడ్మింటన్‌కు సంబంధించి సింధు, శ్రీకాంత్‌ కూడా టాలెంట్‌ హంట్‌లో భాగస్వాములవుతారని సిఎం వెల్లడించారు. వాలీబాల్‌కు సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్‌ ముందుకు వచ్చారని, నైపుణ్యం ఉన్నవాళ్లను ఎంపిక చేస్తారన్నారు. ఖోఖోకు సంబంధించి ఎపి స్టేట్‌ అసోసియేషన్‌ సర్వీసెస్‌ తీసుకుం టున్నామన్నారు. వీటిని ప్రమోట్‌ చేసేందుకు 21 మంది రాష్ట్ర స్థాయి అంబాసిడర్లు, 345 మంది జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు ముందుకు వచ్చి అంబాసిడర్లుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవు తారన్నారు. ప్రతిస్థాయిలో ప్రైజ్‌మనీ ఉంటుందన్నారు. ఆరోగ్య సురక్షలో డయాబెటిస్‌, బిపి కేసులు బయటపడ్డాయన్నారు.

➡️