లండన్‌కు సిఎం జగన్‌

May 18,2024 09:45 #ap cm jagan, #London

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్‌ పర్యటనకు బయలుదేరారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్‌ వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపి నందిగం సురేష్‌, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు తదితరులు సిఎంకు వీడ్కోలు పలికారు. జూన్‌ 1వ తేది వరకు జగన్‌ విదేశీ పర్యటన సాగనుంది. ఎన్నికల ఫలితాలకు రెండు రోజులు ముందు రాష్ట్రానికి ఆయన చేరుకోనున్నారు.

➡️