సిఎం జగన్‌ పర్యటన సమయంలో విమానాశ్రయంలో అనుమానాస్పద వ్యక్తి

May 18,2024 11:15 #cm jagan, #paryatanaa
  •  అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రజాశక్తి – గన్నవరం : సిఎం జగన్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎంకు సమీపంలో తుళ్లూరు లోకేష్‌ అనే ఓ ఎన్నారై డాక్టర్‌ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారించేందుకు ప్రయత్నించగా.. తనకు గుండెపోటు అని చెప్పి కిందపడిపోయాడు. పోలీసులు అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సిఎం జగన్‌ విదేశీ పర్యటనకు సంబంధించిన అప్‌డేట్‌ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు ఇతరులకు అతను పంపినట్లు తెలిసింది. శనివారం ఉదయం అమెస్టర్‌ డ్యామ్‌ ఎయిర్‌ పోర్టులో దిగి అక్కడి నుంచి లండన్‌లోని తన కుమార్తె వద్దకు సిఎం దంపతులు వెళ్లినట్లు సమాచారం. జూన్‌ ఒకటి తిరిగి ఆయన రాష్ట్రానికి రానున్నారు.

➡️