సీఎం జగన్‌ కర్నూలు పర్యటన వాయిదా

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ కర్నూలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4న కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆయన పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు మంత్రి బుగ్గన ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం జగన్‌ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మరో రోజు ఖరారు చేసి సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌ ను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

➡️