విభజన చట్టం సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం..

  • చంద్రబాబుకు రేవంత్‌ ఫోన్‌

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందించారు. ఎపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకుందామని, అందుకు సహకరించాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎంపి బలరాంనాయక్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విప్‌ రాంచంద్రనాయక్‌, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. అదే సమావేశం నుంచి చంద్రబాబుకు రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడారు.

➡️