ప్రజాదర్బార్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజాదర్బార్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు చేరుకున్న ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. నేటి నుంచి ప్రజాదర్బార్‌ ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రకటించారు. దీంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సిఎం స్వీకరించారు. అర్జీలను పరిశీలించి వారి సమస్యలను రేవంత్‌ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి సిఎం వెళ్లనున్నారు. విద్యుత్‌శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

➡️