అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది: కవిత

Dec 30,2023 15:15 #Kavitha, #press meet

హనుమకొండ: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. వన దేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదిక రాకముందే.. ‘పాపాల పుట్ట’ అని ఎలా వర్ణిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలకు అనేక సందేహాలున్నాయని.. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. లబ్ధిదారులకు ఇంకా పింఛన్లు, రైతుబంధు రాలేదని ఆరోపించారు. ఉద్యమం నుంచి ఓరుగల్లు జిల్లా బిఆర్‌ఎస్‌కు పెట్టని కోటగా ఉందని.. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త కాన్వారులను గత ప్రభుత్వం దాచి పెట్టిందన్న ఆరోపణపై కవిత స్పందించారు. నాయకుల భద్రత దఅష్ట్యా పోలీసుశాఖ వాహనాలను సమకూరుస్తుందని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో బగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయలేదని.. అయినా తాము ఓడిపోయామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

➡️