అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

Apr 7,2024 10:36 #conistable death, #Telangana

హైదరాబాద్: ఓల్డ్‌ సిటీలో ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని 1995 బ్యాచ్కు చెందిన బాలేశ్వర్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్ మిస్ఫైర్ అయ్యిందా లేదా ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. బాలేశ్వర్‌ మృతితో పోలీస్‌ శాఖలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

➡️