రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

  • విఆర్‌ న్యాయ కళాశాల స్టూడెంట్స్‌ ఫెస్ట్‌లో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి- నెల్లూరు : భారత రాజ్యాంగం మహోన్నతమైనదని, దీనిని నిశితంగా అర్థం చేసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత భవిష్యత్తు న్యాయవాదులైన న్యాయ విద్యార్థులపై ఉందని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు అన్నారు. నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన విఆర్‌ న్యాయ కళాశాల స్టూడెంట్స్‌ ఫెస్ట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన దేశ రాజ్యాంగం విశిష్టతను వివరించారు. హైకోర్టు ప్రముఖ న్యాయవాది, ఐలు రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజాన్ని అర్థం చేసుకొని అధ్యయనం చేయడం ద్వారా మంచి న్యాయవాదిగా స్థిరపడవచ్చన్నారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సబ్జెక్ట్‌లను వివరించారు. విలువలు పాటించే న్యాయవాదులుగా తయారవ్వాలని సూచించారు. లా విద్య పూర్తయిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పచ్చా కిరణ్‌, గంప సుధీర్‌, వినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️