4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఓట్లను లెక్కిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం … బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడానికి మేజిక్‌ ఫిగర్‌ 60 సీట్లు.

తెలంగాణలోని మొత్తం కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ను మొదలుపెట్టారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీస్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటల 30 నిముషాల నుండి ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చార్మినార్‌లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట తెలుస్తుందని భావిస్తున్నారు. పది గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో 119 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 1,798 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

➡️