పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టాలి

  • హైకోర్టులో కెఎ పాల్‌ పిటిషన్‌

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్‌ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పాల్‌ సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఇసికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌, జస్టిస్‌ న్యాపతి విజరుతో కూడిన డివిజన్‌ బెంజ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పాల్‌ స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య 21 రోజులు గడువు ఉందని, ఇంత గడువుంటే ఇవిఎంల ట్యాంపరింగ్‌ జరిగే అవకాశం ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన హైకోర్టు.. పిల్‌పై విచారణ పరిష్కారం అయినట్లుగా ప్రకటించింది.

➡️