విద్యుదాఘాతంతో దంపతులు మృతి

May 23,2024 21:30 #Couple dies, #electric shock

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు (నెల్లూరు) :విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా టిపిగూడూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గ్రామంలో అన్నం నరసయ్య (60), అన్నం భాగ్యమ్మ (55) దంపతులున్నారు. నరసయ్య కల్లుగీత కార్మికుడు. బుధవారం అర్ధరాత్రి టేబుల్‌ ఫ్యాన్‌ ఆఫ్‌చేసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై నరసయ్య మృతి చెందారు. గది నుంచి బయటకు రాకపోవడంతో భర్తను నిద్రలేపేందుకు వెళ్లిన భాగ్యమ్మ కూడా విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. విద్యుదాఘాతంలో తల్లిదండ్రులు మరణించినట్లు గ్రహించిన కుమారుడు మెయిన్‌ స్విచ్‌ను ఆపేశారు. రాకేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️