ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్‌..

Mar 26,2024 12:54 #dump, #Manyam District, #mavoist, #sized
  • మన్యం సరిహద్దులో మావోయిస్టు ఆయుధ తయారీ కేంద్రం సీజ్‌

ప్రజాశక్తి-మన్యం : సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో సుంకి బీఎస్‌ఎఫ్‌ 65వ బెటాలియన్‌ ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో ఏవోబీలో కూంబింగ్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించామని బెటాలియన్‌ కమాండ్‌ ఆఫ్‌ ఇన్స్పెక్టర్‌ సందీప్‌ కెర్‌కెట్టా తెలిపారు. హేండ్‌ బౌలర్‌, టిగ్గర్‌ మెకానిజం, ఫిల్లర్లు, హేమర్‌, స్లీపర్‌, చేజల్‌, ఫైల్‌, కత్తులు, ఇనుప బిట్లను సామగ్రిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలిపారు.

➡️