తెలంగాణ నూతన గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్‌

  • నేడు బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాజ్‌భవన్‌లో రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే రాధాకృష్ణన్‌ చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సిఎస్‌ ,డిజిపి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

➡️