Palnadu Accident – మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి : సిపిఐ(ఎం) డిమాండ్‌

అమరావతి : పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరుపేట గ్రామం వద్ద జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం, 20 మందికిపైగా గాయపడడం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం, గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్సతోపాటు క్షతగాత్రులను బట్టి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నదని తెలిపారు. బైపాస్‌ వర్క్‌ జరుగుతున్నప్పుడు వాహనాలు స్పీడ్‌ కంట్రోల్‌కు, రోడ్డుపై మట్టి ఇసుక లేకుండా జాగ్రత్త పడడం కాంట్రాక్టర్ల బాధ్యత అని… దీనిని పర్యవేక్షిస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాబట్టి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

➡️