మోడీ పర్యటనపై సిపిఎం ప్రెస్ మీట్(లైవ్)

cpm press meet on modi visit tirupati smart meters

ప్రజాశక్తి-విజయవాడ : శుక్రవారం సిపిఎం రాష్ట్ర కమిటీలో ఆమోదించిన తీర్మానాలను తెలియజేసేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయనున్నారని తెలిపారు. ఆంధ్రాకు ద్రోహం చేసిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ, జగన్ లు కలిసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందంతో ప్రజలపై భారీగా భారాలు వేస్తున్నారని తెలిపారు. అదానికి అధిక లాభాలు కట్టబెట్టడానికి ఇటువంటి ఒప్పందం చేశారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో 20వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

➡️