జనసేన కార్పొరేటరుకు లీగల్‌ నోటీసులిస్తాం : సిఎస్‌ కార్యాలయం

May 26,2024 20:48 #ap cs, #cs jwahar reddy, #notices

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిపై అసత్య, నిరాధరమైన ఆరోపణలు చేస్తున్న విశాఖపట్నం జనసేన కార్పొరేటరు మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్‌ నోటీసు పంపనున్నట్లు ఎపి సిఎస్‌ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. రెండు రోజులుగా సిఎస్‌పై మూర్తి యాదవ్‌ ఆరోపణలు చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించామని ఆ కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు లీగల్‌ నోటీసులు జారీచేయబోతున్నామన్నారు.

➡️