తుపాను హెచ్చరిక : ఎపిలో అతిభారీ వర్షాలు

అమరావతి : ఆదివారం నుండి ఎపిలో అక్కడక్కడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను సోమవారం సాయంత్రం చెన్నై – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచన ఉందని వెల్లడించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ వెల్లడించారు.

weather
weather map
➡️