మతోన్మాద పాసిస్ట్‌ బిజెపినీ, దాని మిత్ర పక్షాలను ఓడించండి ! : సిపిఎం(ఎంఎల్‌)

May 1,2024 08:27 #cpm, #prakatana

హైదరాబాద్‌: రానున్న 18వ లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవనీ, అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో జరుగనున్నాయని , గత 70 ఏళ్లుగా జరిగిన సాధారణ ఎన్నికలు కావని సిపిఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథా) భావిస్తోంది. ఈఎన్నికల్లో ఫాసిస్ట్‌, బిజెపినీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమిని ప్రజా స్వామిక, లౌకిక , వామపక్ష ప్రజా శక్తులంతా కలిసి ఓడించాలని దేశప్రజలకు పిలుపునిస్తోంది. ఈ మేరకు సిపిఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథా) బుధవారం ఓ ప్రటనను విడుదల చేసింది.
”గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి అధిక ధరలతో, నిరుద్యోగంతో, తీవ్ర అసమానలతో, కార్పొరేట్‌ కంపెనీలకు లాబీగా పాలించింది. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అయోధ్య, రాముడు, మతం, మైనార్టీలు, పౌరసత్వం రద్దు ఇత్యాది భావోద్వేగ , ఉన్మాద, విద్వేషపూరిత విధానాలనే తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంది. అదానీ, అంబానీ లాంటి స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల సేవలో తరించి , వీరి ఆస్తులను పెంచింది. ఎన్నికల ముందు కుట్ర పూరితంగా ప్రతిపక్షాల నేతలను, చివరకు ముఖ్యమంత్రులను సైతం అవినీతి పేరుతో అరెస్టు చేసి ఎన్నికల్లో పాల్గనకుండా చేసింది. గవర్నర్‌ వ్యవస్థలనుఏ దుర్వినియోగం చేసింది. జర్మనీ ఫాసిస్ట్‌ నియంత హిట్లర్‌ అడుగుజాడలలో బిజెపి నడుస్తోంది. అందుకే ఈ మతోన్మాద ఫాసిజం దేశానికి అత్యంత ప్రమాదకరమైంది.
బిజెపికి వ్యతిరేకంగా త్రిముఖ పోటీలు ఉన్న చోట బిజెపి వ్యతిరేఖ శక్తులను ఎంచుకోవాలి. అందులో బిజెపిని ఓడించగల అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరుతోంది. ఇందియా కూటమిలో భాగంగా సిపిఎం పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనరస, రంపచోడవరంలో పోటీ చేస్తున్న లోతా రామారావు(రాంబాబు), కర్నూలు జిల్లా పాణ్యంలో పోటీ చేస్తున్న గౌస్‌ దేశారులను, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ యంతేంద్ర కుమార్‌, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోలీచేస్తున్న సరియం రామ్మోహన్‌ను సిపిఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథా) బలపరుస్తూ , మద్దతునిస్తోంది.
ఇందియా కూటమి, ఇతర ప్రతి పక్షాలు దేశంలో రైతులకు ఎం.ఎస్‌.పికి గ్యారెంటీ చట్టం చేయాలి. కార్మిక చట్టాలను పునరుద్దరించాలి.నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి. ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ఉపా లాంటి దుర్మార్గ చట్టాలను రద్దు చేయాలి.దానికింద అరెస్టైన వారందరిపై కేసులు ఎత్తి వేయాలి. సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేయాలని తదితర డిమాండ్లపై ప్రజలకు నిర్థిష్ట హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. రానున్న ఎన్నికల్లో సిపిఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథా) కార్యకర్తలూ, శ్రస్త్రణులు బిజెపి వ్యతిరేక ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొనాలి” అని కోరుతోంది.

➡️