16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 8,2024 16:53 #AP Rythu Sangam, #gramina bandh
  •  కర్నూలులో ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపు

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ కిసాన్‌ మోర్చా, రైతు సంఘాలు తలపెట్టిన ఈ నెల 16 జరుగు గ్రామీణ బందును జయప్రదం చేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. 16న గ్రామీణ బంద్‌పై కర్నూలు సిపిఐ కార్యాలయంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏఐకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పంపన్న గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రామచంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప, ఎఫ్టియు జిల్లా కార్యదర్శి అఖండ, ఏఐకేఎస్‌ జిల్లా కార్యదర్శి కేతవరం. రామకష్ణ, జిల్లా కార్యదర్శి కె.నారాయణ,టి ఎన్‌ టి యు సి జిల్లా నాయకులు నరసింహులు, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కార్యదర్శి పోతుల శేఖర్‌, హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పి.రామచంద్రయ్య మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఆపడంలోనూ,రైతుల సమస్యలు పరిష్కరించడంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ,మారణ హౌమాన్ని సృష్టిస్తున్నారు. దేశంలో లౌకిక తత్వాన్ని కాపాడుకునేందుకు రైతుల ఆత్మహత్యలు ఆపడానికి, డాక్టర్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసులో భాగంగా పంటలకు సి ప్లస్‌ టు 50 శాతం అమలు చేయాలని, రైతుల అప్పులను రద్దు చేయాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, విద్యుత్‌ రంగ ప్రవేటీకరణ బిల్లును రద్దు చేయాలని, రైతు మోటార్లకు మీటర్ల బిగించే విధానాన్ని రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈ నెల 16 జరుగు జాతీయ గ్రామీణ బందును జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్‌. రాధాకష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌. మునెప్ప మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ శక్తులకు అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కార్మిక కోళ్లుగా మార్చి కార్మిక హక్కులను కాల రాస్తున్నారని, కార్మిక కోడ్లు రద్దుచేసి 44 చట్టాల అమలు చేసేందు కు20 23లో సవరించిన వేతనాలను గజిట్‌ చేసి కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని, కార్మికులను జయలకు పంపే ట్రాన్స్పోర్ట్‌ కార్మికులకు నూతనంగా తీసుకొచ్చిన జీవో రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని , ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో తలపెట్టిన గ్రామీణ బందును విజయవంతం చేయడానికి కర్నూలు జిల్లా ఉద్యోగ కార్మికులు సన్నద్ధం కావాలనివారు పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తగినంత బడ్జెట్‌ కేటాయించి సంవత్సరానికి ?200 రోజులు పని దినాలు పెట్టాలని ప్రతి కార్మికుడికి రోజుకి 600 రూపాయలు వేతనం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు.అలాగే బంద్‌ విజయవంతం చేయడానికి జిల్లాలోని పత్తికొండ, ఆదోని ,రెవెన్యూ డివిజన్‌ సెంటర్లలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని,ప్రతి నియోజకవర్గంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహించి గ్రామీణ బందుకు సిద్ధం చేయాలని వారు తీర్మానించారు.ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌. గిడ్డమ్మ, శ్రావణి ఏఐటియుసి నగర ఉప ప్రధాన కార్యదర్శి పి. రామాంజనేయులు, సిఐటియు నగర కార్యదర్శి నర్సింలు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, సాబీర్‌ భాష, పి డి ఎస్‌ యు జిల్లా కార్యదర్శి రమణ, సురేష్‌ నాయక్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు కొంగర. శ్రీనివాసులు, బీసన్న, డి. హెచ్‌ .పి .ఎస్‌. జిల్లా కార్యదర్శి సి .మహేష్‌, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️