ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్‌

Mar 21,2024 15:51 #ACB cases, #arest, #tasildar, #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం : లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దార్‌ కొట్నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. సర్వే నెంబర్‌ కరెక్షన్‌ కోసం శ్రీనివాస్‌ రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. తహశీల్దారు కార్యాలయంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు అధికారుల వద్ద నుంచి ఆ సొమ్మును రికవరీ చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలో  తనీఖీలు చేపట్టారు.

➡️