ఫోటోగ్రాఫర్‌ పై దాడికి నిరసనగా … జర్నలిస్టుల ధర్నా

Feb 22,2024 12:27 #Dharna, #journalists, #photographer

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి కెమెరామెన్‌ పై దాడి కి నిరసనగా రామచంద్రపురం ఎలక్ట్రానిక్‌ ప్రింట్‌ మీడియా విలేకరులు గురువారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిర్వహించారు. అదేవిధంగా ఈనాడు కార్యాలయం పై దాడిని నిరసిస్తూ బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని, సుమోటోగా కేసులు నమోదు చేసే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడి, ఫోర్త్‌ ఎస్టేట్‌ గా ఉన్న జర్నలిస్టులపై దాడిని అందరూ ఖండించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిందని ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు కనికెళ్ళ కనక రత్నం, గంపల పఅధ్వీరాజ్‌, గుబ్బల రాంబాబు, కె. భద్ర రావు, కొప్పిశెట్టి రాము, కుడిపూడి రమేష్‌, దేవ గణేష్‌, గవర వెంకటరమణ, దేవు మహేశ్వరరావు, నరాల త్రిమూర్తులు, బోడపాటి ప్రసాద్‌, యార్లగడ్డ ప్రసాద్‌, న్యూ డెమోక్రసీ నాయకుడు వెంటపల్లి భీమశంకరం తదితరులు పాల్గొన్నారు.

➡️