రేపటి నుంచి విత్తనవేరుశనగ పంపిణీ

ప్రజాశక్తి-అనంతపురం :ఖరీఫ్‌కు సంబంధించి సబ్సీడీ వేరుశనగ కాయలు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు శుక్రవారం నుంచి స్థానిక రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనకాయలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యు.ఉమామహేశ్వరమ్మ గురువారం తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశనగ కోసం 47,704 మంది రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్నారు. అన్ని ఆర్‌బికె కేంద్రాల్లో వేరుశనగ కాయలు నిల్వ ఉంచామన్నారు. శుక్రవారం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు.

➡️