సంక్రాంతి సీజన్‌లో… ప్రత్యేక రైళ్లు

విజయవాడ పశ్చిమ రైల్వే : సంక్రాంతి సీజన్‌లో … రైల్వే ప్రయాణీకుల రద్దీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

జనవరి 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం పూర్ణ-తిరుపతి (07609),

జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి-పూర్ణ (07610),

జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631),

జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నర్సాపూర్‌-హైదరాబాద్‌ (07632),

ఈనెల 7 వ తేదీ నుంచి 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-సికింద్రాబాద్‌ (07481),

జనవరి 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం సికింద్రాబాద్‌-తిరుపతి (07482),

జనవరి 1 నుంచి 31 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ పోర్టు-లింగంపల్లి (07445),

జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో లింగంపల్లి-కాకినాడ టౌన్‌ (07446) రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

➡️