పండగ వేళ పూరిల్లు దగ్ధం – నడిరోడ్డునపడ్డ కుటుంబం

దేవరాపల్లి (అనకాపల్లి) : పండగ వేళ … దేవరాపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పూరిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో దంపతులు, వారి కుమారుడు నడిరోడ్డునపడ్డారు. దేవరాపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో జల్లూరు శేషారావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటిలో ఉన్న రూ. 25 వేల నగదుతో పాటు ఇంటిలో ఉన్న సామగ్రి అంతా బూడిదయిందని బాధితులు వాపోయారు. అగ్నికీలలకు ఇంటిలో ఉన్న సిలిండర్‌ పేలడంతో చుట్టుపక్కలున్న సోలార్‌ ప్యానల్స్‌ ధ్వంసమయ్యాయి.

➡️