నేడు ఎమ్మెల్సీ కవిత భర్తను విచారించనున్న ఈడీ

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. కవితకు ఏడు రోజులు కస్టడీని కోర్టు విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈడీ అధికారులు కవితను విచారించారు. నేడు రెండో రోజు కూడా అధికారులు కవితను విచారించనున్నారు. ఈరోజు (సోమవారం) కవిత భర్త అనిల్‌, వ్యక్తిగత సిబ్బందిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈడీ విచారణ చేపట్టనుంది.

➡️