పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు

ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటీసులు ఇచ్చింది. ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు విరుద్ధంగా పవన్‌ మాట్లాడారని ఈసికి ఏప్రిల్‌ 8న విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి స్కాం స్టార్‌, లాండ్‌ గ్రాబర్‌, సాండ్‌ అండ్‌ లిక్కర్‌ ఎంపరర్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పవన్‌కల్యాణ్‌కు ఈసీ నోటీసులిచ్చింది. 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది.

➡️