నేడు విద్యుత్‌ టారిఫ్‌ విడుదల

Mar 11,2024 10:25 #Electricity tariff

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను విడుదల చేయనుంది. ఇఆర్‌సి ఛైర్మన్‌ జస్టిస్‌ సివి నాగార్జునరెడ్డి విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయం వద్ద ఉన్న రైతు శిక్షణా కేంద్రంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎపిఇఆర్‌సి తొలిసారి విజయవాడలో టారిఫ్‌ను విడుదల చేస్తుంది. రైల్వేకు అందిస్తున్న విద్యుత్‌పై యూనిట్‌కు అదనంగా రూ.1 పెంచాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు తమ ఆదాయ వార్షిక నివేదిక (ఎఆర్‌ఆర్‌)లో ఇఆర్‌సికి ప్రతిపాదించాయి. విద్యుత్‌ వాహనాల స్టేషన్ల నిర్వహణ కింద అందించే సబ్సిడీని తొలగించాలని ప్రతిపాదించాయి. దీని ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థలు రూ.251.33 కోట్ల భారం మోపాయి. ఎఆర్‌ఆర్‌పై ఇఆర్‌సి జనవరి 29, 30, 31 తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది.

➡️