అంతా అసత్యాలే : కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ‘బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం ఒక అబద్ధాల పుట్ట.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగం ధ్వంసమైంది. 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాగే సాగునీటి రంగ పనులన్నీ స్తంభించి పోయాయి. అన్ని రంగాల్లో విఫలమైన జగన్‌ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు గవర్నరుతో అబద్ధాలు మాట్లాడించింది. ‘– కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.

➡️