వడదెబ్బతో రైతు మృతి

Mar 19,2024 21:08 #died, #Farmer, #sun stroke

ప్రజాశక్తి – బనగానపల్లె : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం ఆమడాల గ్రామానికి చెందిన రైతు బోయ చిన్నతిమ్మయ్య (52) వడదెబ్బకు మంగళవారం మృతి చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం పొలానికి వెళ్లిన ఆయన ఎండతీవ్రతను తట్టుకోలేక త్వరగా ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కొద్దిసేపటికే అస్వస్తకు గురై మరణించారు.

➡️