విద్యుదాఘాతంతో రైతు మృతి

Feb 21,2024 17:38 #Farmers Problems, #Kurnool, #Suicide

ప్రజాశక్తి- దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతమునకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వివరాల మేరకు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోయ జడల సూరి(30) అనే రైతు మూడు ఎకరాల విస్తీర్ణంలోని పొలాన్ని సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని నెలల క్రితమే పొలంలో కొత్తగా బోర్ వేయించాడు. బోరు సమీపంలో విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో కేబుల్ వైరు కాలిపోతుందని ఆ వైరును పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. దీంతో విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయాలు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య కలరు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వము కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️