అప్పులబాధ తో రైతు ఆత్మహత్య

Apr 5,2024 21:45 #anathapuram, #rythu, #suside

ప్రజాశక్తి-గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మర్తాడు గ్రామానికి చెందిన గోసుల మల్లికార్జున (38) తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో గత నాలుగేళ్లుగా వర్షాధారం, బోరుబావుల ద్వారా వేరుశనగ, వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. పంటల సాగు, బోర్లు వేయించేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. వరుసగా పంటల్లో నష్టం రావడంతో చేసిన అప్పులు తీర్చే మార్గంలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మల్లికార్జునకు భార్య మల్లీశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

➡️