ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి

చెన్నంపల్లి (అనంతపురం) : అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️