తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..

Feb 27,2024 11:15 #hydrabad, #road acident

హైదరాబాద్‌ : తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుకునూర్‌ పల్లి వద్ద రాజీవ్‌ హైవేపై వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢకొీట్టింది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌ వైపు వస్తున్న కారు తొలుత డివైడర్‌ను ఢకొీట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢకొీట్టడంతో గాల్లో ఎగిరిపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️