సిఐటియులోకి తొలి మహిళ ఆటో డ్రైవర్‌

Mar 7,2024 09:21 #auto drivers, #CITU, #Women

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూలు జిల్లాలో తొలి మహిళ ఆటో డ్రైవర్‌ గౌతమి బుధవారం సిఐటియులో చేరారు. నగరంలోని కొత్త బస్టాండ్‌లో గల కార్మిక కర్షక భవన్‌లో ఆటో కార్మిక సంఘం (సిఐటియు) సభ్యత్వాన్ని ఆమె స్వీకరించారు. గౌతమిని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పిఎస్‌.రాధాకృష్ణ ఎండి.అంజిబాబు, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల, సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.నరసింహులు, సిహెచ్‌ సాయిబాబా, ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్‌, ఆటో యూనియన్‌ న్యూసిటీ ప్రధాన కార్యదర్శి బి.రాధాకృష్ణ, అధ్యక్షులు ఎస్‌.హుస్సేన్‌ వలీలు అభినందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ, ఎండి.అంజిబాబు, నిర్మల మాట్లాడుతూ.. అసమర్ధ ప్రభుత్వాల వల్ల ధరలు భారీగా పెరిగిపోవడంతో దంపతులిద్దరూ పనులు చేస్తే తప్ప కుటుంబాలు గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయితీ ధరలకు ఆటోలు కొనుగోలు చేసి మహిళ డ్రైవర్లకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘంలో ఆమె చేరడాన్ని స్వాగతించారు. గౌతమి మాట్లాడుతూ.. సిఐటియు చేసే అనేక పోరాటాలను నేను స్వయంగా చూశానని, ఆటో డ్రైవర్లకు అండగా సిఐటియు నిలుస్తుందని, అందుకే సభ్యత్వం తీసుకున్నానని తెలిపారు.

➡️