రేపటి నుండి లక్ష్మీ పేరంటాళ్లు తిరునాళ్లు

May 22,2024 21:55 #Lakshmi Perantallu, #Tirunallu

ప్రజాశక్తి – నందిగామ (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో గురువారం నుంచి లక్ష్మీ పేరంటాళ్లమ్మవారి తిరునాళ్లుప్రారంభమవుతాయని ఆలయ ఇన్‌ఛార్జ్‌ ఇఒ ఫణికుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 24న ఊయల సేవ, 25న గ్రామ శిల, బోనాలు, 26న గ్రామ బోనాలు, 27వ తేదీ దీవెన భండారు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయం ముస్తాబు చేసినట్లు ఇఒ ఫణికుమార్‌ తెలిపారు.

➡️