మాజీ మంత్రి గొల్లపల్లి టిడిపికి రాజీనామా

Feb 28,2024 13:04 #TDP, #YCP

ప్రజాశక్తి-రాజోలు : మాజీ మంత్రి, టిడిపి రాజోలు నియోజక వర్గ ఇన్ చార్జ్ గొల్లపల్లి సూర్యరావు బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవుకి, ఇ‌న్ చార్జ్ పదవికి, టిడిపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యరావు మాట్లాడుతూ కష్టకాలంలో టిడిపికి పనిచేశానని, టీడీపీలో నిజాయితీకి గుర్తింపు లేకుండా పోయిందని, దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను టిడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబుకు పంపారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు. నేడు తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

➡️