గూడ్స్‌ రైలులో మంటలు

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద బొగ్గుతో వెళ్తున్న గూడ్స్‌ రైలులో శుక్రవారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పుల్‌బూషియా నుంచి తమిళనాడులోని వెస్ట్‌ కోస్టు పేపరు మిల్లుకు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలు బోగిలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీనిని గమనించిన గూడ్స్‌ డ్రైవర్‌ కృష్ణా కెనాల్‌ వద్ద రైలును నిలిపివేశారు. వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. బోగిలో అంటుకున్న మంటలను ఫైర్‌ సిబ్బంది ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది.

➡️