గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలి : ఎమ్మెల్సీ లక్ష్మణరావు

Jun 18,2024 21:50 #MLC Lakshmana Rao, #press meet

ప్రజాశక్తి-గుంటూరు :గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. గ్రూప్‌ా2 మెయిన్స్‌ పరీక్ష జులై 28 నుండి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ప్రకటించిందని, కానీ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులు ప్రిపరేషన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సిలబస్‌ విస్తృతి ఎక్కువగా ఉందని తెలిపారు. మరో రెండు నెలలు గ్రూప్‌ా2 పరీక్షలను పొడిగించాలని లక్ష్మణరావు కోరారు.

➡️