చేనేత కార్మికుడు ఆత్మహత్య

Apr 9,2024 00:28 #anathapuram, #death

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా నార్పల మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కేసేపల్లి గ్రామానికి చెందిన నాగానంద (44)కు ఓ సొంత మగ్గం ఉంది. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కుటుంబ పోషణ, మగ్గాల నిర్వహణకు దాదాపు రూ.నాలుగు లక్షల వరకు అప్పులు చేశారు. ఇటీవల ముడిసరుకు ధరలు పెరగడం, నేసిన చీరలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులకు వడ్డీల భారం అధికమైంది. అప్పులు తీరేదారిలేక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

➡️