ఈనెల 23 వరకు ఎపి-తెలంగాణలో భారీ వర్షాలు

విశాఖ : ఈ నెల 22 వ తేదీన నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతోంది. ఈ కారణంగా ఈ నెల 23 వరకూ ఎపి, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

➡️